clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

2.2 కార్యకలాపం 1: చంద్రుని యొక్క దశలు

పదకోశం



కార్యకలాపం 1ఎ: చంద్రుని యొక్క దశలు (నమూనా)

గమనిక: ఈ ప్రయోగాన్ని చీకటి గదిలో చేయాల్సి ఉంటుంది.

మెటీరియల్: చిన్న గోళాకార వస్తువు(ఒక బంతి లేదా ఒక నిమ్మకాయ), గట్టి కర్ర లేదా సైకిల్ స్పోక్, టార్చ్ లైట్/బల్బు


ప్రక్రియ:

  1. బంతిని కర్రకి గట్టిగా అతికించండి. ఈ బంతి ఒక చంద్రుడిగా ఉంటుంది.

  2. ఇప్పుడు మీ చేయి చాచండి, చేయిని భుజం ఎత్తు వరకు తీసుకురండి మరియు మీ చుట్టూ బంతిని కదపండి.(కుడి చేతి నియమం ప్రకారం భ్రమణం చేయాలని గుర్తుంచుకోండి!) చంద్రుడి యొక్క ఒక భాగం మాత్రమే కనిపిస్తుంది. భూమి నుండి చంద్రుడు ఇలా కనిపిస్తుంది. కావున మీ తల భూమి అవుతుంది.

  3. ఇప్పుడు మీ స్నేహితుడిని దాదాపు 2 మీటర్ల దూరంలో నిలబడమని మరియు టార్చిని మీ వైపు వెలిగించమని అడగండి. ఇవి సూర్య కిరణాలు.

  4. మళ్ళీ చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్య ఉండేట్లు మీ చేయిని చాచండి. వెలుతురు ఉన్న చంద్రుడి భాగం దేనినైనా మీరు చూస్తారా1?లేదు! ఇది అమావాస్య యొక్క స్థితి.

  5. ఇక్కడ నుండి, అపసవ్య దిశలో భ్రమణం ప్రారంభించి ఒక పూర్తి చుట్టు తిప్పండి మరియు మీరు ఏమి చూసారో పరిశీలించండి.

    • కొద్దిగా భ్రమణం చేసిన తరువాత చంద్రుడిలో కొంచెం వెలుతురుగా ఉన్న భాగం కనిపిస్తుంది. దీని ఆకారాన్ని గమనించండి. ఇది ఒక నెల వంక లాగే ఉన్నదా? అసలు స్థితి నుండి మీరు 90° భ్రమణం చేయడం కొనసాగిస్తుండగా నెలవంక పెద్దగా అవుతుంది.

    • 90° వద్ద మీరు సగం వెలుతురుగా ఉన్న భాగాన్ని చూడగలరు. ఇది అర్ధం చంద్రుడి కొరకు స్థితి.

    • మీ భ్రమణాన్ని కొనసాగించండి మరియు చంద్రుడి సగం కన్నా ఎక్కువ వెలుతురు భాగాన్ని మీరు చూస్తారు. ఈ ఆకారం గిబ్బస్ చంద్రుడి లాగే ఉంటుంది మరియు మీ భ్రమణాన్ని ఇంకొక 90° మీరు పూర్తి చేస్తుండగా అది పెద్దగా అవుతుంది.

    • చంద్రుడు సూర్యుడికి (టార్చ్) ఖచ్చితంగా వ్యతిరేక వైపు ఉన్నప్పుడు, మీరు మొత్తం అర్ధ గోళం వెలుతురుగా ఉండటం మీరు చూస్తారు.(మీ తల ఈ టార్చ్ లైటుని అడ్డుకుంటే, చంద్రుడిని మీ తల కన్నా కొంచెం ఎత్తులో కదపండి).ఇది పౌర్ణమి యొక్క స్థితి. ఇది చంద్రుడు వృద్ధి చెందడం పూర్తవుతుంది.

    • మీ భ్రమణాన్ని కొనసాగించండి మరియు మీరు గిబ్బస్ చంద్రుడిని మళ్లీ చూస్తారు మరియు మీరు ఇంకొక 90° భ్రమణం చేసినప్పుడు అది ఇంకా చిన్నగా అవుతుంది.

    • 90° వద్ద మీరు మళ్ళీ అర్ధ చంద్రుడిని చూస్తారు. కానీ ఇది అర్ధ చంద్రుడు క్షీణించడం. ఈ సారి, గతంలో చూసిన దాని కన్నా ఒక విభిన్న మైన అర్ధ భాగం కనిపించడం మీరు చూస్తారు (ఎడమ అర్ధ భాగం చంద్రుడు వృద్ధి సమయంలో వెలుతురు ఉన్నది మరియు ఈ సారి, కుడి అర్ధ భాగం వెలుతురుగా ఉన్నది.

    • మీ భ్రమణాన్ని కొనసాగించండి మరియు నెలవంక చిన్నగా మరియు చిన్నగా అవడం చూడగలరు.

    • మీరు భ్రమణం పూర్తి చేసినప్పుడు, వెలుతురుగా ఉన్న భాగం ఏదీ మళ్ళీ కనిపించదు. మీరు తిరిగి అమావాస్య స్థితికి వచ్చారు!

1మనం పాఠం 1లో ఇప్పటికే చర్చించినట్లు, భూమి పైన వాతావారణం నుండి వ్యాపించబడిన వెలుగు ఉంటుంది, కావున చీకటి గదిలో కూడా నేరుగా వెలుతురు లేనప్పటికీ మీరు చంద్రుడిలో భాగాన్ని మీరు చూడగలరు. కానీ అంతరిక్షంలో, వ్యాపించడానికి వాతావరణం ఉండదు కావున చంద్రుడు యొక్క చీకటి భాగం కనిపించదు.


లేదా

కార్యకలాపం 1బి: చంద్రుడి దశలు (రోల్ ప్లే)
 

గమనిక : సూర్యుడు ఆకాశం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు, అంటే, ఉదయం (దాదాపు 9 గంటలు) లేదా సాయంత్రం (4 గంటలు) రోల్ ప్లే చేసినప్పుడు ఉత్తమంగా పనిచేస్తుంది.

మీరు దీనిని లోపల చేస్తుంటే, కాంతి ఒక వైపు నుండి వచ్చేట్లు  నిశ్చయపరచండి; గోడకు ఉన్న కిటికీలు మాత్రమే తెరచి గానీ లేదా కాంతి వనరుని (ఉదా. ఒక ప్రొజెక్టర్) ఒక వైపున ఉంచి గానీ చేయండి.
 

ప్రక్రియ:

  1. జంటలుగా, కనీసం కొన్ని అడుగుల దూరంలో నిలబడండి.
  2. ఒక్కో జంటలో, ఎడమ వైపున ఉన్న విద్యార్థులు భూమిగా ఉంటారు మరియు కుడి వైపున ఉన్న విద్యార్థులు చంద్రుడిగా ఉంటారు.
  3. చంద్రుడు భూమి మరియు కాంతి వనరు (సూర్యుడి) మధ్య నిలబడాలి. చంద్రుడి ముఖం పైన నేరుగా ఇంకేదైనా కాంతి ఉన్నదా? లేదు! తమ తల వెనుక భాగం వెలుతురుగా ఉండాలి, కానీ భూమి నుంచి కనపడకూడదు.
  4. మీరు గత తరగతిలో చేసినట్లు, చంద్రుడు నిదానంగా భ్రమణం చేయాలి మరియు భూమి చుట్టూ తిరగాలి.
  5. చంద్రుడి ముఖంలో ఎంత భాగం వెలుతురుగా ఉన్నదో భూమి జాగ్రత్తగా పరిశీలించాలి. చంద్రుడు భ్రమణం చేయటం ప్రారంభించగా, భూమి తన ఎడమ బుగ్గ పైన పడటం, ఒక నెలవంక లాగా ప్రారంభమవుతుంది మరియు క్రమంగా పెద్దగా అవుతుంది.

  6. చంద్రుడు తను తిరగడంలో పావు భాగం పూర్తి చేసినప్పుడు (ఆగండి మరియు భూమిని చూడనీయండి), ఖచ్చితంగా చంద్రుడు యొక్క సగ భాగం వెలుతురుతో ఉండాలి.(చంద్రుడు సగ భాగం వెలుతురుగా ఉండి, సగ భాగం భూమికి కనిపిస్తూ (తలలో వెలుతురు భాగం) భూమి నుండి కనిపించదు.)

  7. చంద్రుడు తన చుట్టూ తిరుగుతూ ఉండగా, సగం కన్నా ఎక్కువగా ఉండి, గిబ్బస్ చంద్రుడి లాగా ఉంటుంది. ఇది చంద్రుడు ఇంకొక 90° చుట్టూ తిరిగే వరకు పెద్దగా మరియు పెద్దగా అవుతుంది.

  8. చంద్రుడు ఖచ్చితంగా భూమికి ఎదురుగా ఉన్నప్పుడు, పూర్తి ముఖం వెలుతురుగా (ఆమె కాంతిని అడ్డుకుంటుంటే భూమి కొద్దిగా వంగాలి) ఉంటుంది. ఇది పౌర్ణమి యొక్క స్థితి. ఇది చంద్రుడు వృద్ధి చెందడం పూర్తిచేస్తుంది.

  9. చంద్రుడు తన చుట్టూ తిరగడం కొనసాగుతుండగా ముఖంలో వెలుతురు భాగం చిన్నగా అవడం ప్రారంభమయి, గిబ్బస్ లాగా ఉంటుంది.

  10. చంద్రుడు మరొక 90° చుట్టూ తిరిగినప్పుడు (తను పూర్తి తిరగడంలో ముప్పావు భాగం), దాని ముఖం సగం భాగం వెలుతురుగా ఉండటం మీరు చూస్తారు. ఈ సారి, గతంలో చూసిన దాని కన్నా ఒక విభిన్న మైన అర్ధ భాగం కనిపించడం మీరు చూస్తారు (చంద్రుడి ఎడమ వృద్ధి అర్ధ సమయంలో వెలుతురు ఉన్నది మరియు ఈ సారి, కుడి బుగ్గ వెలుతురుగా ఉన్నది.

  11. తన భ్రమణంలో చివరి పావు భాగంలో చంద్రుడు కొనసాగుతుండగా, మీరు సగం కన్నా ఎక్కువ ముఖం వెలుతురుగా ఉండి, నెలవంక లాగా ఉంటుంది మరియు నెలవంక చిన్నగా మరియు చిన్నగా అవడం మీరు చూస్తారు.

  12. చివరిగా, చంద్రుడు ఒక చుట్టు పూర్తి చేసినప్పుడు, మనం తిరిగి ముఖం పైన వెలుతురు లేని అమావాస్య స్థితిలోకి వస్తాము. ఇది చంద్రుడు వృద్ధి క్షీణించడం పూర్తి అవుతుంది.

మీరు నేర్చుకున్నది గీయగలరా? మీ రెఫరెన్సు కోసం చిత్రం 2 చూడండి. ఇది ఉత్తర ధృవం నుండి భూమి- చంద్రుడి కుటుంబాన్ని చూపుతుంది. తన కక్ష్యలో చంద్రుడు ఎనిమిది స్థితులలో చూపబడినది. ఇవ్వబడిన సమయంలో చంద్రుడిలో సగం భాగం మాత్రమే వెలుతురుగా ఉన్నదని గమనించవచ్చు. చంద్రుడి పక్కనున్న చిత్రం, కక్ష్య వెలుపల చంద్రుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు భూమి నుండి చంద్రుడు ఎలా కనిపిస్తుందో చూపుతుంది.

Phases

చిత్రం 2: చంద్రుడి యొక్క దశల వివరణ



అమావాస్య నుండి అమావాస్యకు ఒక దశ వలయం పూర్తి అవుతుంది.(మీరు పౌర్ణమి నుండి పౌర్ణమికి లేదా ఏదైనా ఇతర దశ నుండి అదే దశకు లెక్కించవచ్చు).ఒక దశ పూర్తి చేయడానికి ఇది 29½ రోజులు పడుతుంది, అందుకే, చాలా పురాతన క్యాలెండర్లలో, ఒక నెలలో 30 రోజులు ఉన్నాయి. ఇండియన్ క్యాలెండర్లలో దశ వలయాన్ని బట్టి నెలని నిర్వచిస్తాయి, ప్రతి రోజు (తిథి) చంద్రుడి ఒక్క దశకు అనురూపంగా తెలుపబడుతుంది. ఉదాహరణకు, ఈ రోజు (నేను ఈ పాఠం వ్రాస్తున్నప్పుడు) ఇది శ్రావణ మాసంలో శుక్ల చతుర్దశి (వృద్ధిచెందుటలో 14వ రోజు) మరియు శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు, నేను రక్షా బంధన్  జరుపుకుంటాను(రాఖీ పూర్ణిమ, ఝులన్ పూర్ణిమ, నరాలి పూర్ణిమ, సలనో జనాయ్ పూర్ణిమ లేదా రిషితర్పణి అని కూడా ఇండియాలో విభిన్న ప్రాంతాలలో అంటారు).ఇండియాలో జరుపుకునే చాలా పండగలు చంద్రుడి యొక్క విభిన్న దశలను బట్టి ఉన్నాయి. అట్టి పండుగలను మీరు కనుగొని మరియు మీ నోట్ బుక్ లో వ్రాస్తారా?

మీకు ఈ రోజు తిథి ఏమిటో కనుగొనండి.

  1. ఏదైనా ఇవ్వబడిన రోజు నాడు భూమి పైన ఉన్న అందరు వ్యక్తులు చంద్రుడి యొక్క అదే దశను చూడగలరా?
  2. దక్షిణ అర్ధ గోళంలో ఉన్న ప్రజలు ఉత్తర అర్ధ గోళంలో ఉన్న ప్రజల లాగే చంద్రుడి యొక్క అదే దశను చూడగలరా?
  3. మీరు చంద్రుడి పైన ఉన్నారని అనుకుందాము. చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది? పాఠం 2లో మనం అప్పటికే చర్చించినట్లు, భూమి నుండి సూర్యుడు మరియు చంద్రుని ఒక్క సైజు దాదాపు ఒకే లాగా ఉంటుంది. చంద్రుడి నుండి సూర్యుడు మరియు భూమి యొక్క సైజు ఒకే లాగా కనిపిస్తుందా? లేదు అయితే, భూమి సూర్యుడి కన్నా చిన్నాగా లేదా సూర్యుడి కన్నా పెద్దగా కనిపిస్తుందా? మీరు భూమి యొక్క దశలను చూడగలరా?
    1. భూమి నుండి మనం పౌర్ణమి చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    2. భూమి నుండి మనం అమావాస్య చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    3. భూమి నుండి మనం సగం చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడి నుండి భూమి ఎలా కనిపిస్తుంది?
    4. భూమి నుండి మనం చంద్ర గ్రహణం చూసినప్పుడు, చంద్రుడి నుండి మీరు ఏమి చూస్తారు?


 

(రాయడానికి ఐకాన్ పై క్లిక్ చేయండి)
enter

చర్చ

చంద్రుడి యొక్క నిర్దిష్ట దశ నాడు సంభవించే పండుగల జాబితా ఒకటి చేయండి. ఒక్కో విద్యార్థి కనీసం ఒక పండుగ పేరు తెలపాలి. (అందరికీ అవకాశం రావడానికి ముందుగా మీ జవాబుని ఒక్క పేరుకి మాత్రమే పరిమితం చేయండి. ఒక వారం తరువాత జాబితా అసంపూర్తిగా ఉంటే మీకు తెలిసినన్ని రాశి పేర్లు చెప్పండి కానీ, ప్రతిస్పందన పునరావృతం చేయవద్దు)