గత పాఠంలో, మీరు చంద్రుడు భూమి చుట్టూ భ్రమణం చేస్తుందని మరియు చుట్టూ తిరుగుతుందని మనం నేర్చుకున్నాము. దీని భ్రమణ అవధి మరియు కక్ష్యా అవధి (ఒక చుట్టు పూర్తి చేయడానికి పట్టే సమయం) ఒకటే, అందుకే మనం చంద్రుడి ముఖాన్ని మాత్రమే చూస్తాము.
చంద్రుడి యొక్క ఆకారం ప్రతి రోజు ఒకే లాగ ఉండదని మీరు తప్పక గమనించి ఉంటారు. ఇది ఎలా మారుతుంది? చంద్రుడి యొక్క విభిన్న ఆకారాలు గీయండి.
ప్రతి రోజూ చంద్రుడు మారుతున్న అదే క్రమంలో దాని ఆకారాలను గీయడానికి ప్రయత్నించండి.
డ్రాయింగ్ కోసం మీ నోట్బుక్ని ఉపయోగించండి. మీరు డ్రాయింగ్ చేస్తున్న పేజీలో రాయండి- ప్రాథమిక ఖగోళ మాడ్యూల్: యూనిట్ 2: లెసన్ 2: పరిచయం & మీ లాగిన్ ID
ఒక నిర్దిష్ట రోజులో, చంద్రుడు అస్సలు కనిపించడని మీరు గమనించి ఉంటారు. దీనినే అమావాస్య అంటారు. తరువాత రోజు నెలవంక కనిపిస్తుంది. అది ప్రతి రోజూ పెద్దగా అవుతుంది మరియు ఎనిమిదవ రోజు నాడు అర్ధ చంద్రునిగా కనిపిస్తుంది. అది ఇంకా పెద్దగా అవుతుంది మరియు ఇంకొక ఏడు రోజుల తరువాత మీరు పౌర్ణమిని చూస్తారు. చంద్రుడి యొక్క ఆకారంలో అమావాస్య నుండి పౌర్ణమికి మార్పుని చంద్రుడు వృద్ధి చెందడం అంటారు.
తరువాత, వ్యతిరేక క్రమంలో, చంద్రుడు చిన్నగా అవుతాడు. మనం ఒక గిబ్బస్ (పూర్తి కన్నా తక్కువ కానీ సగం కన్నా ఎక్కువ) చంద్రుడిని ఏడు రోజుల పాటు చూస్తాము, తరువాత మనం అర్ధ చంద్రుడిని ఎనిమిదవ రోజు చూస్తాము. తరువాత నెలవంక చిన్నగా అవడం మరియు ఇంకొక 7 రోజులకు చిన్నగా అయి, చివరిగా ఒక రోజు ఆకాశంలో చంద్రుడు లేకుండా ఉంటుంది. చంద్రుడి యొక్క ఆకారంలో పౌర్ణమి నుండి అమావాస్యకి మార్పుని చంద్రుడు క్షీణించడం అంటారు.
చంద్రుడు యొక్క విభిన్న రకాలను చంద్రుడి యొక్క దశలు అని అంటారు. ఖచ్చితంగా, చంద్రుడిలో తన ఆకారం నిజంగా మార్పు ఉండదు! అయితే చంద్రుడి యొక్క ఆకారం మారినట్లు ఎందుకు కనిపిస్తుంది?
చంద్రుడు, స్వయం ప్రకాశం కాదని మీకు తెలుసు. ఇది సూర్యకాంతిని పరావర్తనం చేస్తుంది కావున ఇది మెరుస్తుంది. ఏదైనా ఇవ్వబడిన సమయంలో చంద్రుడిలో ఎంత భాగం వెలుతురుగా ఉంటుంది? భూమి లాగే, చంద్రుడిలో సగ భాగం ఎల్లప్పుడూ సూర్య కాంతి వెలుగుతో ఉంటుంది (చిత్రం 1) భూమి నుండి ఎంత భాగం వెలుతురుగా ఉన్నదో దానిని బట్టి చంద్రుడి దశ ఉంటుంది. దీనిని ఒక కార్యకలాపంతో చూడటానికి ప్రయత్నిద్దాము.
చిత్రం 1: ఇవ్వబడిన సమయంలో చంద్రుడిలో సగం భాగం మాత్రమే వెలుతురుగా ఉన్నది
పదకోశం