clix - Unit 2: The Moon
     Help Videos
Introduction Adding Buddy Exploring Platform Exploring Units
A-  A  A+

×
×
New profile photo
×
Unit 2: The Moon

Select from the following:

* Use Ctrl + Click to select multiple options

Selections:

×

1.1 చంద్రుడి యొక్క లక్షణాలు

పదకోశం



గత పాఠాలలో, భూమి సూర్యుని చుట్టూ ఒక భ్రమణం చేయడానికి పట్టే సమయం ఒక రోజు అని కాగా సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఒక సంవత్సరం అని మనం నేర్చుకున్నాము. మనం సమయాన్ని కొలిచే ఇంకొక విధానం గురించి మీరు ఆలోచించగలరా?
 
మనం ఒక సంవత్సరాన్ని రెండు నెలలుగా విభజిస్తాము. ఒక నెలకు ఖగోళ పరమైన దృగ్విషయానికి ఏదైనా సంబంధం ఉన్నదా?
చాలా పురాతన సంస్కృతులలో సమయాన్ని కొలవడానికి చంద్రుని దశలను ఉపయోగించేవారు. చంద్రుడి వలయం నుండి 'నెల' అనే పదం వచ్చింది. పాత క్యాలెండర్లలో (ఉదా., చైత్రి పంచాగం,హిజ్రీ క్యాలెండర్) చాలా వాటిలో అమావాస్య నుండి తరువాత వరకు ఒక నెల అవుతుంది.


చంద్రుడి గురించి మీకు ఏమి తెలుసు? మీకు తెలిసిన అన్ని వాస్తవాలను జాబితా చేయండి.
(రాయడానికి చిత్రంపై క్లిక్ చేయండి)
enter

చంద్రుడి గురించి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి:

a. చంద్రుడు భూమి యొక్క సహజ ఉపగ్రహము: ఒక గ్రహము చుట్టూ భ్రమణం చేసే ఒక ఖగోళ వస్తువుని ఉపగ్రహము అంటారు. చంద్రుడు భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహము.

b ​చంద్రుని ఉపరితం: ఆకాశంలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైనది. తరువాత ప్రకాశవంతమైనది చంద్రుడు. రాత్రి పూట ఆకాశంలో చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైనప్పటికీ, అది స్వయంగా ప్రకాశించలేదు. అది సూర్యుడి నుండి కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ఇది తెల్లగా ప్రకాశవంతంగా కనిపించినప్పటికీ, చంద్రుడి యొక్క ఉపరితలం భూమి కన్నా కొద్దిగా చీకటిగా ఉంటుంది.

చంద్రుడి పైన ఉన్న నల్లని మచ్చలు బిలాలు. అవి నక్షత్ర శకలాల ప్రభావం వలన ఏర్పడినాయి. ఈ బిలాలలో కొన్నింటిలో కాంతి క్రింది భాగానికి ఎన్నడూ చేరుకోదు. అందువలన, చంద్రుని యొక్క బిలాల లోపల చాలా చల్లగా ఉండవచ్చు. ఒక టెలిస్కోపు నుండి చంద్రుడిని చూసినప్పుడు ఇలా ఉంటుంది.


Full
చిత్రం 1: భూమి నుండి చూసినప్పుడు పౌర్ణమి
(క్రెడిట్: Image by Gregory H. Revera, CC BY-SA 3.0 Source: https://en.wikipedia.org/wiki/Moon#/media/File:FullMoon2010.jpg)
 

c. ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ: చంద్రుని ద్రవ్యరాశి (7.342×1022 కిగ్రా) భూమి ద్రవ్యరాశి (5.97237×1024 కిగ్రా కన్నా చాలా తక్కువ. మీరు నిష్పత్తిని లెక్కిస్తే, భూమి చంద్రుని ద్రవ్యరాశి కన్నా దాదాపు 80 రెట్లు ఉన్నదని మీరు కనుగొంటారు. ఒక వస్తువుకు ఉండే గురుత్వాకర్షణ శక్తి దాని ద్రవ్యరాశిని బట్టి ఉంటుంది. కావున చంద్రుని యొక్క గురుత్వాకర్షణ బలం భూమి కన్నా తక్కువ. చంద్రుని పైన, మీ బరువు భూమి పైన మీ బరువులో ⅙ భాగం ఉంటుంది. కావున చంద్రుడి పైన మీరు చాలా తేలికగా అనిపిస్తారు.

d. వాతావరణం: చంద్రుడి పైన వాతావరణం లేదు. ఎందుకో మీరు ఊహించగలరా? సరే, ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి బలహీనము, తేలిక మూలకాల లాంటి వాయువులు కొట్టుకుపోయి నిజంగా వాతావరణం లేకుండా గట్టి రాళ్ళను ఉంచుతాయి.

చంద్రుడి ప్రకృతి దృశ్యం, పర్వతాలు మరియు బిలాలు, వేలకొలది సంవత్సరాల నుంచి మారలేదు ఎందుకంటే దానిని మార్చడానికి గాలి లేదు లేదా నీరు లేదు.

భూమి నుండి, ఆకాశం నీలంగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఎందుకంటే గాలిలోని చిన్నని కణాల నుండి సూర్యకాంతి వెదజల్లబడుతుంది. అయితే, చంద్రుడి పైన, కాంతి వెదజల్లడానికి వాతావరణం లేదు కావున ఆకాశంలో సూర్యుడు కనిపించినప్పుడు కూడా ఆకాశం నల్లగా కనిపిస్తుంది. మరియు గాలి లేకపోవడం వలన, చంద్రుడిలో ధ్వని ఉండదు.

e. స్పష్టమైన సైజు: ఒక పౌర్ణమి రోజు నాడు, చంద్రుడు సూర్యుడి యొక్క సైజులో లాగా కనిపిస్తాడు (1 డిగ్రీ చుట్టూ కోణీయ సైజు)సూర్యుడు యొక్క వ్యాసము చంద్రుడు కన్నా దాదాపు 400 రెంటలు ఉన్నది. యాదృచ్ఛికంగా, సూర్యుడు చంద్రుడి నుండి దాదాపు 400 రెట్ల దూరంలో ఉన్నాడు.అందుకే అవి ఒకే సైజులో ఉన్నట్లు కనిపిస్తాయి. మానవులు బొమ్మలు లాగా కనిపించేంత దూరంలో ఉన్నాయి.

చంద్రుడి పైన మీరు ఎలా అనుకుంటారో ఒక క్షణం ఊహించుకోండి. మీరు చీకటిగా ఉన్న, గరుకు తలం పైన, చీకటి ఆకాశం క్రింద ఉన్నారు మరియు చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉన్నది. గాలి లేదు, నీళ్లు లేవు, చెట్లు లేవు మరియు జీవం లేదు.

మరియు మీరు భూమి పైన ఎగిరే దాని కన్నా 6 రెట్లు ఎక్కువ ఎత్తు ఎగరవచ్చు. చంద్రుడి ఉపరితలాన్ని సమీపంగా చూడండి.

అపోలో 11 మిషన్ సమయంలో వ్యోమగామి బుజ్ ఆల్డ్రిన్ యొక్క ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఉన్నది. ఈ ఫోటోని నీల్ ఆమ్‌స్ట్రాంగ్ తీసారు.

 

Buzz

చిత్రం 2: చంద్రుడి పైన అపోలో 11 మిషన్ సమయంలో ఒక వ్యోమగామి (బుజ్ ఆల్డ్రిన్)
(క్రెడిట్: ఎన్ఎఎస్ఎ ఇమేజ్ గ్యాలరీ)